కబాలి అల్లుడితో కూడా ఆమే.?

  radhika apte act dhanush

మొన్న కబాలిలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా నటించిన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇప్పుడు అల్లుడు ధనుష్‌తో రొమాన్స్ చేయబోతోంది. ప్రకాష్‌రాజ్ నటించి దర్శకత్వం వహించిన ధోని చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన రాధికా ఆ తరువాత ఆల్ ఇన్ ఆల్ అళగురాజా, వెట్రిసెల్వన్ చిత్రాలలో నటించింది.

అయితే ఈ మూడు చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.తెలుగులో బాలకృష్ణకు జోడీగా లెజెండ్‌లో చేసినా అవకాశాలు మాత్రం అరకొరగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో పా.రంజిత్ కబాలిలో హీరోయిన్‌గా ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ నటించ డంతో ఒక్కసారిగా ఆమెకు క్రేజ్ పెరిగిపో యింది. దీంతో అవకాశాలు కూడా వెల్లువెత్తుతు న్నాయి. తాజాగా ధనుష్ నిర్మించి నటించనున్న కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది.

SHARE