Posted [relativedate]
రాధికా ఆప్టే …ఒక్క నటనతోనే కాదు..ఎంచుకునే పాత్రలు,కథలతో పాటు ఇచ్చే ప్రకటనలతో కూడా సంచలనాలు రేపడం ఆమెకి అలవాటే.ఈ అమ్మడు ఇప్పటికే బోల్డ్ సీన్స్ లో ఇంకా బోల్డ్ గా నటించి కుర్రకారుని తన వైపు లాగేసుకుంది.ఓ టాలీవుడ్ హీరో తన నుంచి ఏదో ఆశించాడని చెప్పి మంట పుట్టించింది.రాధికా ఆప్టే వ్యవహారశైలిని ఇలా చూస్తుంటే ఆమె పబ్లిసిటీ కోసం,అవకాశాల కోసం ఇలా రెచ్చిపోతుందని అనుకోవడం సహజం.అయితే అందులో నిజం లేదంట.
సినిమా మీద ఉన్న ప్రేమతోటే ఎంతటి త్యాగానికైనా సిద్ధం అంటోంది రాధికా.ఇంతకీ అమ్మడి దృష్టిలో త్యాగం ఏమిటంటే ..కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికైనా రెడీ అట. అలా చేయడానికి తాను రెడీ అని రాధికా ఇంతకుముందే ప్రకటించింది.ఇప్పుడు ఆ ప్రకటనకు ఇంకాస్త మసాలా జోడించింది.తాను న్యూడ్ గా నటించడానికి భర్త ప్రోత్సాహం కూడా ఉంటుందని చెప్పింది.ఏదేమైనా ఒక్క ప్రకటనతో అందర్నీ తన వైపు తిప్పుకోవడం ఎలాగో రాధికకి బాగా తెలుసు.