యాదాద్రి చరిత్రపై దర్శకేంద్రుడి సినిమా..!!

Posted February 3, 2017

raghavendra rao plan to movie on yadadri pilgrims historyఅన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస సినిమాలను తెరకెక్కించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..  చాలా సంవత్సరాల తరువాత ‘ఓం నమో వేంకటేశాయ’ అనే భక్తిరస చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగార్జున, అనూష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ  సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రాఘవేంద్రరావు త్వరలో మరో భక్తి చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ‘యాదాద్రి’ చరిత్రపై తాను సినిమాను తీయాలని అనుకుంటున్నట్లు రాఘవేంద్రరావు ప్రకటించారు. ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా విడుదల కానున్న సందర్భంలో ఆయన యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి క్షేత్రం  ఎంతో మహిమాన్వితమైనదని, ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఆ చరిత్రపై అధ్యయనం చేసి, త్వరలోనే యాదాద్రి చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. దీంతో ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత దర్శకేంద్రుడి సినిమా ఇదేనని చెప్పుకుంటున్నారు.

SHARE