Posted [relativedate]
కింగ్ నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఓం నమో వెంకటేశాయ. సినిమా టైటిల్ భక్తి పేరు పెట్టి సినిమాలో రక్తిని కూడా మిక్స్ చేస్తున్నాడట రాఘవేంద్ర రావు. హతిరాం బాబా జీవిత చరిత్రతో వస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం జగపతిబాబు మహరాజులా కనిపిస్తాడట. ఇక విమలరామన్ కూడా ఉన్నదని తెలిసిందే.
రాజు జగపతి బాబు, విమలా రామన్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. తన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా చూసే రాఘవేంద్ర రావు భక్తిలో రక్తి కూడా ఉంచుతున్నారు. అయితే ఇలా చేసే పాండురంగడు సినిమా బూతు చిత్రం చేశారనే కామెంట్ కూడా వినిపిస్తుంది. జగపతి, విమలారామన్ లు ఇద్దరు ఇప్పటికే గాయం-2, చట్టం సినిమాల్లో అదిరిపోయే రేంజ్లో రొమాన్స్ చేశారు.
ఇప్పుడు రాఘవేంద్ర రావు డైరక్షన్లో కూడా ఇద్దరు తెచ్చిపోతారట. ఇలానే అన్నమయ్య సినిమాలో కూడా మోహన్ బాబు, రోజాలతో ఓ మంచి రొమాంటిక్ సాంగ్ తీశారు రాఘవేంద్ర రావు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాగ్ ఈ సినిమాతో కూడా అదే రేంజ్ హిట్ కొడతాడని అంటున్నారు. మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.