Posted [relativedate]
నందమూరి నటసింహం బాలకృష్ణ..త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ ని చేయనున్నానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు బాలయ్యే దర్శకత్వం వహించనున్నట్లు అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. అయితే నటన, దర్శకత్వం రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమని గ్రహించిన బాలయ్య రీసెంట్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని సంప్రదించాడట.
ఎన్టీఆర్.. రాఘవేంద్రరావుకి మంచి అనుబంధం ఉండడం, అలాగే వారి కాంబినేషన్ లో ఎన్నో హిట్ చిత్రాలు రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని బాలయ్య అభిప్రాయ పడ్డాడట . ఆ అభిప్రాయాన్నే రాఘవేంద్రరావు దగ్గర వ్యక్తపరిచాడట బాలయ్య. అయితే దర్శకేంద్రుడు మాత్రం బాలయ్య కోరికను సున్నితంగా తిరస్కరించాడని సమాచారం.
ఎన్టీఆర్ జీవిత కథని తెరకెక్కించడం అంత ఈజీ కాదని, చాలా శోధించాలని చెప్పాడట రాఘవేంద్రరావు. అది కత్తి మీద సాము వంటిది అని చెప్పి తప్పించుకున్నాడట. దీంతో బాలయ్య… ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే దర్శకుడి వేటలో పడ్డాడని నందమూరి సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.