జగన్,రాహుల్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్?

Posted November 28, 2016, 9:30 am

download-1
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ కి వైసీపీ అధినేత జగన్ నుంచి అనూహ్య మద్దతు లభించింది .ఇప్పటికే మోడీ నిర్ణయం మీద పోరాటానికి ముందున్న మమతా బెనర్జీ ,మహాకూటమి అండతో బీహార్ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకున్న నితీష్ లాంటి సీఎం లు కూడా భారత్ బంద్ పిలుపుకి మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు.దీంతో కాంగ్రెస్ విస్తుపోయింది .వెంటనే మాట మార్చి తాము బంద్ పిలుపే ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రకటించింది .విపక్షాల చీలికతో భారత్ బంద్ కాస్త ఆక్రోస్ దివస్ గా మారిపోయింది.మోడీ నిర్ణయం మీద అంతగా పోరాటం చేయని జగన్ ఒక్కసారి కూడా ఈ విషయంలో ఢిల్లీ వెళ్ళలేదు.కానీ వైసీపీ మాత్రం ఈ భారత్ బంద్ కి మద్దతు అంటూ ప్రకటించేసింది.ఇది చూసినయువరాజా వారు తెగ సంతోషపడిపోయుంటారు.

అటు ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం జగన్ వస్తే తమ పార్టీ లో ఆయనే సీఎం అభ్యర్థి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.సోనియా ,రాహుల్ మనసెరిగి మాట్లాడే పనబాక లక్ష్మి కూడా తాజాగా ఇదే కామెంట్ చేశారు.ఎన్నికలు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే పిల్ల కాంగ్రెస్ ,తల్లి కాంగ్రెస్ నుంచి వస్తున్న మాటలు,సంకేతాలు చూస్తుంటే రాహుల్ ,జగన్ మధ్య మధ్య సమ్ థింగ్ …సమ్ థింగ్ అనిపించడం లేదూ!