వాటర్,టీ సప్ప్లై …రాహుల్ ప్లాన్ ?

0
543
rahul comments on modi's ideas

Posted [relativedate]

raకేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి రెండున్నర ఏళ్ళు అయింది.అయితే ఒక్క సందర్భంలో కూడా మోడీకి గట్టి పోటీ ఇవ్వగలదన్న నమ్మకాన్ని ఆ పార్టీ ఇవ్వలేకపోయింది.ఒక్క సారి కూడా మోడీకి రాహుల్ ప్రత్యామ్న్యాయం అన్న ఆలోచన ప్రజల్లో రాలేదు.సర్జికల్ స్ట్రైక్స్,నోట్ల రద్దు తర్వాత పరిస్థితి మరీ దిగజారింది.కాంగ్రెస్ కి కనీసం మోడీ చర్యల మీద విమర్శించే అవకాశం,ధైర్యం లేకుండా పోయాయి.అలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఇచ్చిన ఓ పిలుపు,దానికి పార్టీ శ్రేణుల స్పందన ఆసక్తి రేపుతున్నాయి.

500 , 1000 నోట్లు మార్చుకోడానికి వచ్చి బ్యాంకుల దగ్గర ఇబ్బంది పడుతున్న జనానికి సహాయం చేయాలని పార్టీ శ్రేణులకు రాహుల్ పిలుపు ఇచ్చారు.ఆ పిలుపుతో కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు బారులు తీరిన జనానికి నీరు,తేనీరు అందిస్తున్నారు.ఇలా చేయమని రాహుల్ చెప్పారో లేదో గానీ జరుగుతున్నది అదే ..పైగా బ్యాంకు లావాదేవీలు,వ్యవహారాహాల్లో ఓ పార్టీ కార్యకర్తలు ఇంతకు మించి చేసేది ఏముంటుంది?కాకపోతే ఒక్క ఇంప్రెషన్ కలగొచ్చు.మోడీ నిర్ణయంతో బ్యాంకుల దగ్గర నుంచోవాల్సిన ఇబ్బంది కలిగింది.పాపం కాంగ్రెస్ కార్యకర్తలు టీ,నీళ్లు ఇచ్చారు అని జనం అనుకోవచ్చు. అయితే రెండేళ్ళకి ఇదంతా గుర్తు ఉంటుందా? అప్పటి సంగతేమోగానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తోంది ఆసక్తికరమే!

Leave a Reply