రాహుల్ కు అంత సీన్ లేదా?

0
286
rahul dont have the power to oppose modi

Posted [relativedate]

rahul dont have the power to oppose modiనోట్ల ర‌ద్దు అంశాన్ని క్యాష్ చేసుకొని ప్ర‌ధాని మోడీని ఇరుకున పెడ‌దానుకున్న కాంగ్రెస్ కు ఏదీ క‌ల‌సి రావ‌డం లేదు. . దేశంలోని 13 ప్ర‌ధాన పార్టీలు కేంద్రం నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నా… ఆ వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకోవ‌డంలో రాహుల్ గాంధీ ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. మోడీకి వ్య‌తిరేకంగా చాలా రోజుల త‌ర్వాత ఒక పోరాటం చేసే అవ‌కాశాన్ని జార‌విడుచుకున్నారు. పార్టీల‌న్నింటిని ఏకం చేసి.. ఒక రాజ‌కీయ శ‌క్తిగా త‌యారు చేయ‌డంలో ఆయ‌న అట్ట‌ర్ ఫ్యాప్ అయ్యారు. ఇందుకు ఇటీవ‌లి బంద్ ఉదంత‌మే బెస్ట్ ఎగ్జాంపుల్. నోట్ల ర‌ద్దుపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇత‌ర పార్టీలు కూడా మోడీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నా… బంద్ కు మాత్రం మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు.

దేశంలోని ప్ర‌ధాన నాయ‌కుల్లో మ‌మతా బెన‌ర్జీ, అరవింద్ కేజ్రీవాల్, చంద్ర‌బాబు నాయుడు, కేసీఆర్, అఖిలేశ్ యాద‌వ్.. .ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రులుగా ఉన్న వీరెవ్వ‌రూ బంద్ కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. అంతేకాదు ఇత‌ర పార్టీలు కూడా దాదాపుఇదే అభిప్రాయంతో ఉన్నాయి. బంద్ అన‌వ‌స‌ర‌మ‌ని వారి గ‌ట్టి అభిప్రాయం. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై ప‌లు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రుల‌కు అభ్యంత‌రాలు చాలానే ఉన్నాయి. అయినా నో బంద్ అంటున్నారు. కాంగ్రెస్ కు నో స‌పోర్ట్ అని తెగేసి చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ప్ర‌స్తుతం కాంగ్రెస్ ను ముందుండి న‌డిపిస్తున్న రాహుల్ గాంధీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు ప‌రిశీల‌కులు.

Leave a Reply