కొత్త ప్రేమ పుట్టింది ..

  rahul gandhi akhilesh yadav new love
రాజకీయాల్లో మరో కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది .వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఈ సరికొత్త ప్రేమకథకు తెర లేచింది.పొత్తులపై ఇప్పుడిప్పుడే సంకేతాలు కనిపిస్తున్నాయి.యూపీ లో ఒంటరిపోరాటమని చెప్పిన పార్టీలు బాణీ మార్చేస్తున్నాయి.కాంగ్రెస్ ,సమాజ్ వాదీ పార్టీల అగ్రనేతలు రాహుల్,అఖిలేష్ ఒకరినిఒకరు తెగ పొగిడేసుకుంటున్నారు.ఇటీవల యూపీ పర్యటనలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ మంచోడని..కాకపోతే అయన ప్రభుత్వమే సరిగా పనిచేయడం లేదని రాహుల్ అన్నారు .ఈ వ్యాఖ్యల్లో రెండో సగాన్ని పట్టించుకోని అఖిలేష్ ఎదురు భజన మొదలెట్టారు.రాహుల్ మంచోడు,గొప్ప మానవతావాది ,ఇక్కడ ఎక్కువ రోజులుంటే నాక్కూడా మంచి మిత్రుడవుతాడని అఖిలేష్ తిరుగు జవాబిచ్చారు.మొత్తానికి ఈ కొత్త లవ్ ఎన్నికల పొత్తు కోసమే కావచ్చు.

SHARE