Sunday, October 17, 2021
Homelatestవీహెచ్ బ్రాస్ లెట్ కావాలన్న రాహుల్

వీహెచ్ బ్రాస్ లెట్ కావాలన్న రాహుల్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణలో మూడేళ్ల తర్వాత నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ సక్సెస్ అయింది. రాహుల్ ముఖ్య అతిథిగా రావడంతో.. నేతలంతా గ్రూపులు,విభేదాలు పక్కనపెట్టి ఏకతాటిపై నడిచి సభను సక్సెస్ చేశారు. దీంతో టీకాంగ్రెస్ లో ఎక్కడలేని హుషారు కనిపిస్తోంది. టీఆర్ఎస్ వరంగల్ సభ కన్నా సంగారెడ్డి కాంగ్రెస్ సభకే ఎక్కువ జనం వచ్చారని కొన్ని మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు హస్తం పార్టీ నేతలు.

అయితే సభ సమయంలో జరిగిన ఓ సరదా సన్నివేశం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫైర్ బ్రాండ్ గా ఉన్న సంగారెడ్డి నేత జగ్గారెడ్డి సభకు అయ్యే ఖర్చంతా పెట్టుకున్నారు. దీని కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. గ్రౌండ్ కు కూడా చివరి నిమిషం వరకూ అనుమతులు రాలేదు. మొత్తం మీద అనుకున్నదానికంటే సభను ఎక్కువ విజయవంతం చేసి సీనియర్ల మన్ననలు అందుకున్నారు. అందుకే ఫుల్ ఖుషీ అయిపోయిన వీహెచ్ జగ్గారెడ్డిని రాహుల్ కు పరిచయం చేశారు. ఈయనే సభ నిర్వాహకుడని, మొత్తం తానే ఖర్చుపెట్టాడని చెప్పారు.

అప్పుడే రాహుల్ వీహెచ్ కు అసలు సిసలైన పంచ్ వేశారు. సభకు మీరేం ఇచ్చారని ప్రశ్నించడంతో వీహెచ్ షాకయ్యారు. తేరుకుని తన దగ్గర ఏముందని ఇవ్వడానికి అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వదలని రాహుల్ గాంధీ మీ బ్రాసె లెట్ ఉందిగా అది ఇచ్చేయండంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతే వీహెచ్ సహా అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అంత హడావిడిలోనూ వీహెచ్ చేతికి ఉన్న బ్రాస్ లెట్ ను రాహుల్ గుర్తించడం ఆయన పరిశీలనా శక్తికి నిదర్శనమంటున్నారు హస్తం నేతలు.

- Advertisment -
spot_img

Most Popular