హోదా గోదాలోకి రాహుల్ ?

    rahul gandhi meeting ap demand special status
పోగొట్టుకున్న చోటే వెదుక్కోవడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది .విభజనతో ఆంధ్రాలో పునాదులే లేకుండా పోయిన కాంగ్రెస్ ఇప్పుడు హోదా గోదాలోకి దిగి పూర్వ వైభవం కోసం పోరాడబోతోంది .అది రాష్ట్ర స్థాయి వ్యవహారంగా 10 జన్ పద్ భావించట్లేదు .ఏకంగా రాహుల్ గాంధీని ఈ పోరాటంలో భాగం చేయాలని భావిస్తోంది .రాజధాని అమరావతి సమీపంలోనే విజయవాడ కేంద్రంగా రాహుల్ తో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన .

ఎంపీ కేవీపీ,pcc అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కి దీనికి సంబంధించిన సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది . ఈ నెలలోనే ఆ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి హస్తం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి .హోదా డిమాండ్ కి మద్దతు ఇవ్వడం ద్వారా కేవలం ఆంధ్రాలో కాకుండా దేశంలో బీజేపీ చేతిలో అవమానించబడుతున్న ప్రాంతీయ శక్తులకు గేలం వేయొచ్చని కాంగ్రెస్ వ్యూహకర్తల అభిప్రాయం .మిత్ర పక్షాల్ని సైతం అవమానిస్తున్న బీజేపీ వైఖరిని మిగతా దేశానికి చాటడానికి ఈ పోరాటం ఉపయోగపడుతుందని రాహుల్ సలహాదారు ప్రశాంత్ కిషొర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం .

SHARE