Sunday, October 17, 2021
Homelatestరాహుల్ కు పదవి భేతాళ ప్రశ్నేనా..?

రాహుల్ కు పదవి భేతాళ ప్రశ్నేనా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాహుల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యేదెప్పుడు..? ఈ ప్రశ్నకు సమాధానం కోసం కాంగ్రెస్ క్యాడర్ పదమూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎధురుచూస్తోంది. రాహుల్ ను అధ్యక్షుడ్ని చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించడంతో.. హమ్మయ్య ఆ శుభముహూర్తం రానే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ లేటెస్ట్ డెవలప్ మెంట్స్ చూస్తుంటే.. మరోసారి ఈ ప్రతిపాదన పక్కకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
రాహుల్ కు ముందు మెచ్యూరిటీ రావాలని, అందుకోసం ఆయనకు ఓ సలహాదారుల బృందం ఏర్పాటుచేయాలని సోనియా భావిస్తున్నారట. కానీ ఇప్పటికే ఉన్న సలహాదారుల మాట వినని రాహుల్.. కొత్తగా పెట్టేవారి మాటకు విలువిస్తారా అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. రాహుల్ నిజాయితీగా ఉంటారు. సూటిగా మాట్లాడతారు. కానీ లౌక్యం తెలీదన్నదే కాంగ్రెస్ నేతల కంప్లైంటి.
ముత్తాత నెహ్రూ, నాయనమ్మ ఇందిర, నాన్న రాజీవ్ పోలికలు వచ్చాయి కానీ.. వారి లక్షణాలు మాత్రం రాలేదని హస్తం పార్టీ తెగ బాథపడిపోతోంది. రాహుల్ ఎధిగేదెప్పుడు.. మోడీని పోటీ ఇచ్చేదెప్పుడని వారు నిట్టూరుస్తున్నారు. ఏదోలా రాహుల్ ను వెంటనే అధ్యక్షుడ్ని చేస్తే కొత్త ఊపు వస్తుందని, మరోసారి కాలయాపన చేస్తే అంతే సంగతులంటున్నారు నేతలు.

- Advertisment -
spot_img

Most Popular