లే లే లే …రాహుల్

0
657

rahul gandhi sleeping
పార్లమెంట్ లో మరోసారి అదే దృశ్యం ఆవిష్కృతమయ్యింది .యువరాజు రాహుల్ సేద తీరారు ..అదేలేండి ..కాస్త కునుకు వేశారు . ఓ వైపు గుజరాత్ లో దళితుల మీద దాడికి సంబంధించి వెలుగుజూసిన చిత్రాలతో ఇటు దేశం ..అటు పార్లమెంట్ అట్టుడుకుతున్నాయి .ఈ విషయం లో బీజేపీ డిఫెన్స్ లో పడినట్టు కనిపించింది .ప్రతిపక్షాలకు కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్ సమాధానం ఇస్తున్నారు . అది చూస్తున్న జనానికి రాహుల్ గాంధీ నిద్రపోతున్న దృశ్యాలు బోనస్ గా కనిపించాయి .దీంతో కాంగ్రెస్ పెద్దలు అబ్బా అంటూ నిట్టూర్చారు ..విషయం యువరాజు కి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు .

పార్లమెంట్ లో రాహుల్ ఇలా నిద్రావస్థ లో కనిపించడం చాలా సార్లు జరిగింది .ఏదో ఆసక్తి లేని అంశాలు అనుకుందామంటే ..చర్చ ..గుజరాత్ గురించి …మోడీ అడ్డా లో దళితుల మీద దాడి గురించి …ఇంత ముఖ్యమైన విషయం చర్చిస్తున్నప్పుడు కూడా రాహుల్ నిద్దరోతే ..ఏమి జరుగుతుందో మనం ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు ..కాంగి”రేసు ‘ ఏమి అవుతుందో హస్తం నేతలకు బాగా తెలుసు ..ఇకనైనా లే …రాహుల్

Leave a Reply