రాహుల్ వ‌ర్సెస్ ప్రియాంక….

0
489
rahul gandhi vs priyanka gandhi

Posted [relativedate]

rahul gandhi vs priyanka gandhi
కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంక గాంధీ రావాల‌న్న డిమాండ్ ఎప్ప‌ట్నుంచో ఉంది. అయితే ఆమె మాత్రం వ‌స్తాన‌ని కానీ… రాన‌ని గానీ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ప్రియాంక .. ప్ర‌చారంలో పాల్గొనాల‌ని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న యూపీలో ప్రియాంక ఎంట్రీ ఇస్తే కొంతైనా లాభం జ‌రుగుతుందేమోన‌ని కాంగ్రెస్ నేత‌ల ఆశ‌. ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో రాహుల్ గాంధీ స‌న్నిహితుల్లో అస‌హ‌నం పెరుగుతుంద‌ట‌. అదే స‌మ‌యంలో ఆమె నో అని చెప్పాల‌ని వారు లోలోప‌ల అనుకుంటున్నార‌ట‌. అందుకే ఇక‌ ఆమెను అడ‌గ‌డం అన‌వ‌స‌మ‌న్న నిర్ణ‌యానికి వాళ్లు వ‌చ్చేశార‌ని టాక్.

ప్రియాంకపై రాహుల్ వ‌ర్గం అస‌హ‌నానికి కార‌ణం లేక‌పోలేదు. ఆమె పాలిటిక్స్ లోకి వ‌స్తే.. రాహుల్ గాంధీపై అంద‌రి ఫోక‌స్ త‌గ్గుతుంది. అలా జ‌ర‌గ‌డం ఆయ‌న‌ స‌న్నిహితుల‌కు ఇష్టం లేదు. సో ప్రియాంక రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డ‌మే మంచిద‌ని వారు కోరుకుంటున్నారు. అదే స‌మ‌యంలో ప్రియాంక ఎంట్రీతో ఏదైనా అద్భుతం జ‌రుగుతుందేమోనని కొంత‌మంది సీనియ‌ర్లు ఆశిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ లో ఎవ‌రికి వారుగా అంచ‌నాలు వేసుకుంటూ… ఈ ఊహాగానాల‌ను కాస్త రాహుల్ వ‌ర్సెస్ ప్రియాంక‌గా మార్చేశారు.

Leave a Reply