రాహుల్,జగన్ అయన మాటే వింటారా?

 rahul jagan here prashant kishor words?రాహుల్,జగన్ ఈ ఇద్దరికీ 2019 ఎన్నికలు ఎంత కీలకమో వేరే చెప్పనక్కరలేదు.జగన్ స్వయంగా పార్టీ శ్రేణులతో 2019 ఎన్నికలు మనకి జీవన్మరణ సమస్యే అని తేల్చేశారు.అయితే రెండేళ్లుగా రాహుల్,జగన్ రాజకీయ వ్యూహాలేమి పెద్దగా పనిచేయలేదు.అందుకే తమ వ్యూహాలకి పదును పెట్టేందుకు,తమను గెలుపు వాకిట నిలిపేందుకు ఓ మాస్టర్ బ్రెయిన్ కావాలని డిసైడ్ అయ్యారు.ఇప్పటికే రాహుల్ ఆ వ్యూహకర్త తో ఒప్పందం కూడా చేసుకున్నట్టే తెలుస్తోంది.ఆయన మరెవరో కాదు …2014 ఎన్నికల్లో మోడీకి ప్రధాని పీఠం దక్కడానికి వ్యూహాలు రూపొందించిన ప్రశాంత్ కిషోర్..

బీహార్ లోని ఓ డాక్టర్ కుటుంబంలో పుట్టిన ప్రశాంత్ కి ఇప్పుడు కేవలం 39 ఏళ్ళు .అయన ఏమి చదివారో కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు.అయితే 20 ల్లోనే ఆరోగ్య కార్యకర్తగా జీవితం మొదలు పెట్టారు.సొంత రాష్ట్రం బీహార్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేశాడు.అదే రంగంలో ఐక్యరాజ్యసమితి తరపున ఆఫ్రికా వ్యవహారాలు చూసే స్థాయికి ఎదిగారు.అదే తపనతో భారతీయ వైద్యరంగ సమస్యలు,పరిష్కారాల గురించి ఓ నివేదిక తయారు చేశారు .దాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కి పంపారు.పెద్దగా స్పందన లేకపోవడంతో అదే నివేదికతో అయన రాహుల్ ని కలిశారు .

కొద్దిగా మెచ్చుకున్న యువనేత అమేథీ నియోజగవర్గంలోని ఓ ఆస్పత్రి నిర్వహణ వ్యవహారాలు చూసుకోమని అడిగారు.సున్నితంగా ఆ ప్రతిపాదన తిరస్కరించిన ప్రశాంత్ …ప్రధానికి పంపిన నివేదిక కాపీని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి పంపారు.దాన్ని చదివిన మోడీ …ప్రశాంత్ ప్రతిభను గమనించి దగ్గరికి పిలిపించుకున్నారు.ఆరోగ్య విషయాలతో మొదలైన చర్చ రాజకీయాలవైపు మళ్లడం..ప్రశాంత్ టాలెంట్ కి మోడీ ఫిదా కావడం …అయన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ పని చేయడం ఓ కలలాగా జరిగిపోయింది.

2014 ఎన్నికలకి ముందు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ..మోడీని చాయ్ వాలా గా అభివర్ణించినపుడు దాన్ని ప్రశాంత్ ఒడిసిపట్టారు.దాన్నే ఓ ఎన్నికల అస్త్రంగా మలిచి మోడీని సామాన్యుల ప్రతినిధిగా ప్రజల మనస్సులో నిలిచేలా చేశారు.సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,మోడీ విజయానికి బాటలు వేశారు.అమిత్ షా బీజేపీ పగ్గాలు చేపట్టడం,ఎన్నికల వ్యూహాల రూపకల్పన కోసం ప్రశాంత్ ఓ పెద్ద సంస్థ తో ముందుకు రావాలనుకోవడం …ఈ రెండు అంశాలు మోడీ,ప్రశాంత్ మధ్య దూరం పెంచాయి.

అదే సమయం లో సొంత రాష్ట్రం బీహార్ ఎన్నికలు వచ్చాయి.నితీష్ తన వ్యూహకర్తగా ప్రశాంత్ ని ఎంచుకున్నారు .రంగం లోకి దిగిన వెంటనే మహాకూటమి ప్రతిపాదనకు నితీష్ ని ప్రశాంత్ ఒప్పించారు.ఆ తరువాత కమలదళం ఎంత ప్రయత్నించినా ఆ కాంబినేషన్ ని ఓడించలేకపోయింది.ఈ రెండు ఫలితాలు చూశాక రాహుల్ దృష్టి ప్రశాంత్ మీద పడింది.ఆయనే స్వయంగా ప్రశాంత్ ని పిలిపించుకొని మాట్లాడారు.యూపీ లో తమ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయాలని అడిగి ఒప్పించారు .ఆ క్రమం లో 2019 కి కూడా కాంగ్రెస్ తరపున ప్రశాంత్ పనిచేసేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

ఈ పరిణామాల్ని గమనిస్తూ వస్తున్న వైసీపీ వ్యూహకర్తలు ఇటీవల ప్రశాంత్ ని సంప్రదించినట్టు విశ్వసనీయ సమాచారం.యూపీ ఎన్నికలయ్యాక పూర్తిస్థాయి ఒప్పందం కుదరొచ్చని తెలుస్తోంది.అందుకే పార్టీ ముఖ్యులతో ఈ విషయాన్ని జగన్ చూచాయగా చెప్పారట.ఆరోగ్య కార్యకర్తగా ఇక్కడ ప్రశాంత్ పనిచేసిన విషయాన్నీ ప్రస్తావించారట.జగన్ ఆలోచన అమలైతే రాహుల్,జగన్ 2019 కి ఒకే వ్యూహకర్త సలహాలు పాటించాల్సి ఉంటుంది.

కాంగ్రెస్,వైసీపీ ల మధ్య పొత్తు ప్రస్తావన అక్కడక్కడా విన్పిస్తున్న తరుణం లో రెండు పార్టీలు ఒకే వ్యూహకర్తకి జై కొట్టడం కాకతాళీయమా ?వ్యూహాత్మకమా ? ఏదైనా …ప్రజాక్షేత్రం,అనుసరిస్తున్న విధానాలు మారకుండా కేవలం వ్యూహాలే విజయాలు కట్టబెడతాయని పార్టీలు నమ్మడం ఆశ్చర్యకరమే …కానీ ప్రశాంత్ ఎపిసోడ్ తో విజయాల వెంట సినీ రంగ ప్రముఖులే కాదు రాజకీయ పార్టీలు పరిగెడతాయని ప్రూవ్ అయ్యింది .

SHARE