డాక్టరేట్ ను తిరస్కరించిన క్రికెట్ జీనియస్!!

Posted January 26, 2017

rahul rdavid ignored doctrate
ఈరోజుల్లో డాక్టరేట్ ఇస్తామంటే వద్దనే వాళ్లుంటారా? పైగా దాని కోసం లాబీయింగ్ చేసే వాళ్లుంటారు!! కానీ డాక్టరేట్ ఇస్తానంటే వద్దంటూ… సున్నితంగా తిరస్కరించాడు ఓ క్రికెట్ జీనియస్. ఆయన మరెవరో కాదు.. ప్రస్తుతం అండర్-19 భారత జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్.

బెంగళూరు యూనివర్సిటీ భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈనెల 27న యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్భంగా డాక్టరేట్ ను ప్రదానం చేస్తామని తెలిపింది. అయితే రాహుల్ ద్రవిడ్ మాత్రం ఈ ఆఫర్ ను తిరస్కరించాడు. అందుకు ఆయన చెప్పిన కారణం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

క్రీడల్లో ఓ సబ్జెక్టును ఎంచుకుని పరిశోధిస్తాడట ద్రవిడ్. ఆ పరిశోధనతో డాక్టరేట్ను సంపాదిస్తాను తప్ప గౌరవ డాక్టరేట్ను స్వీకరించబోనని చెప్పుకొచ్చాడు. ఇంటికొస్తున్న అవార్డును కాదనుకోవడం రాహుల్ ద్రవిడ్ కే సాధ్యమంటున్నారు క్రికెట్ అభిమానులు.

మరోవైపు ద్రవిడ్ ఈ డాక్టరేట్ ను సాధించడంలో చాలా పట్టుదలతో ఉన్నాడట. ఇప్పటికే క్రికెట్ కు సంబంధించిన టాపిక్ ను తీసుకున్నాడట. దానిపై చాలా సీరియస్ గా పరిశోధన చేస్తున్నాడని టాక్. ఈ ప్రాజెక్ట్ మొత్తం సిద్ధమైపోయిందని సమాచారం. చూస్తుంటే… త్వరలోనే ఆయన డాక్టరేట్ ను సాధించడం ఖాయమంటున్నారు ద్రవిడ్ సన్నిహితులు.

SHARE