వెంకటగిరి ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్ సీక్రెట్?

Posted September 29, 2016

 railway contractor press meet venkatagiri mla ramakrishna

ఓ రైల్వే కాంట్రాక్టర్ బహిరంగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ప్రెస్ మీట్ పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా సదరు ఎమ్మెల్యే అవినీతి బాగోతాన్ని, అడ్డగోలు మాటల్ని మీడియాకు పట్టించడం మరీ కష్టం. అయినా సరే ఎక్కడినుంచో వచ్చిన ఓ సంస్థ ప్రతినిధి ఆ స్థాయికి వెళ్లడం వెనక ఓ రహస్యముంది. అది అందరికీ తెలిసిందే అయినా దాని గురించి బయటకు మాట్లాడటానికి సదరు ఎమ్మెల్యే కే కాదు ఏపీ సర్కారే భయపడుతోంది. ఇంతకీ ఆ రహస్యం ఏంటంటే?

వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణని ఇరికించిన మాంటెకార్లో కంపెనీ గుజరాత్ కి చెందినది. ఏపీ లో కాంట్రాక్టు దక్కగానే రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగింది. గుజరాత్ లో బీజేపీ పెద్దలతో వున్నా పరిచయం ఇక్కడ మిత్ర పక్షం టీడీపీ అధికారం… దీంతో పనులు సజావుగా సాగుతాయని భావించింది. ఎమ్మెల్యే డిమాండ్ లు మొదలయ్యాక పరిస్థితి అర్థమైంది. మొదట్లో ఎంతోకొంత ఇద్దామని అనుకున్నా… ఎమ్మెల్యే అనుచరులు ఒప్పుకోలేదట. పైగా మీరు గుజరాత్ నుంచి వచ్చినా, మోడీ చుట్టాలైనా మాకేం భయం లేదన్నట్లు మాట్లాడారట. ఆ మాటల్ని రికార్డు చేసి చెప్పాల్సిన వాళ్ళకి, చేరాల్సిన చోటుకి చేర్చారట. అక్కడ నుంచి అభయం వచ్చాకే ఈ ప్రెస్ మీట్ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం బయట పెట్టారంట… తప్పుచేసిన వాళ్లు కూడా ఈ విషయం గ్రహించే ఇపుడు కుక్కిన పేనుల్లా పడి ఉంటున్నారట.

SHARE