జులై 1 నుంచి టికెట్ బుకింగ్, రద్దు,తాత్కాలిక విధానాల్లో మార్పులు వస్తున్న వార్తల్ని రైల్వేశాఖ కొట్టిపారేసింది..సోషల్ మీడియా లో ఈ అసత్యాల్ని విస్తృత ప్రచారం చేయడంతో ఆ శాఖ అలర్ట్ అయింది.మార్పులేమీ లేవని,ఆ ప్రచారాల్ని నమ్మవద్దని కోరింది.సోషల్ మీడియా ప్రచారాల్ని దృవీకరించుకోకుండానే పత్రికలు కూడా రాయడాన్ని రైల్వేశాఖ తప్పుపట్టింది .పేపర్ టికెట్ ను రద్దు చేసే ఆలోచనలేదని వివరించింది.