రైల్వేకి వరద నష్టం

railway flood lossనడికుడి సెక్షనులో దెబ్బతిన్న రైలుమార్గం పనులు వర్షం కారణంగా జాప్యం అవుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు ఈ మార్గంలో రైళ్లన్నింటిని రద్దు చేశారు. అసలే విజయవాడలో ఆర్‌ఆర్‌ఐ పనులు కారణంగా పలు రైళ్లను నడికుడి మార్గంలో మళ్లించేందుకు దక్షిణ మధ్య రైల్వే షెడ్యూల్‌ రూపొందించుకోగా వరద కారణంగా ఈ మార్గంలోనూ రైళ్లు నిలిచిపోవడంతో రైల్వేకు అపారమైన నష్టం వాటిల్లుతోంది. దెబ్బతిన్న ట్రాక్‌, రైళ్ల రద్దు కారణంగా రూ. కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

SHARE