వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్ని ఇన్నాళ్టికి వరుణ దేవుడు పలకరించాడు. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి.మరో వైపు ఈ నెల 26 న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్తున్న మాటలు రైతన్నల్లో ఆశలు రేపుతున్నాయి.ఈ వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు,గాలిలో తేమ పెరిగి హైదరాబాద్ సహా రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో చెదురుమదురు వానలు పడుతున్నాయి.
ఏపీలోని ప్రకాశం,గుంటూరు ,కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడ్డాయి.దీంతో 20 రోజులుగా మండించిన ఎండలు తగ్గి వాతావరణం చల్లబడింది .ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి .ఏమైనా చల్లబడిన వాతావరణం చూసిన రైతన్నలు ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా వాన అంటూ కూనిరాగాలు తీస్తున్నారు .