ఆ నిర్మాత మళ్లీ మెగా ఫోన్ పడతాడు ..

raj kandukuriఇతర రంగాల్లో మాంచి ఫామ్‌లో ఉన్నా చాలామంది సినీ పరిశ్రమ వైపు చూస్తుంటారు. ఇక్కడ డబ్బులు కమ్మరించి… మరింతగా సంపాదించాలనుకుంటారు. కొందరు బిజినెస్ మైండ్‌ సెట్‌తో వస్తే.. మరికొందరు ఇంట్రెస్ట్‌తో ఈ ఫీల్డ్‌లోకి దూకుతుంటారు. రాజ్ కందుకూరి కూడా ఈ జాబితాలోకే వస్తారు.

రాజ్ కందుకూరికి మంచి వ్యాపారాలున్నాయి. కానీ కొన్నేళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలోనే తిరుగుతున్నారు. కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేయడంతో పాటూ నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. అంతే కాక మెగా ఫోన్ పట్టేసి ‘గోల శీను’ అనే సినిమానూ తెరకెక్కించారు. కానీ ఆ చిత్రం వచ్చివెళ్లిన సంగతి జనాలకు అంతగా తెలీలేదు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో మరోసారి ఈయన వార్తల్లోకి వచ్చారు. ఈ సినిమాకు నిర్మాత ఆయనే. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాపై రాజ్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే, దర్శకుడిగా చేతులు కాల్చుకున్నా రాజ్ కందుకూరి మరో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్టు సిద్ధమైందని సందీప్ కిషన్ – నిఖిల్ లాంటి పేరున్న చిన్న హీరోల కోసం ఆయన ట్రై చేస్తున్నారని అంటున్నారు. అంతా బాగానే ఉన్నా.. ఆయన్ను నమ్మి.. ఈ సినిమా ఎవరు చేస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న

SHARE