రాజ్ ‘తరుణం’ వచ్చేసిందా ?

  raj tarun demand 1 crore rupees a movieఅదిరిందయ్యా రాజ్ తరుణ్, అదే కొత్త ఇల్లూ… అదే  కొత్త అపార్టుమెంటూ…,కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నావట.ఇంకేంటి సెటిలై పోయినట్టేనా?ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో పాతావుగా జెండా… అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలెట్టావ్.అనుకోకుండా హీరో అయ్యావు అయినా మొదటి సినిమాతోనే మెప్పించి, మంచి మార్కులుతోనే పాసయ్యావు.యాక్టింగ్ ఫస్ట్ టైం అని అనిపించకుండా చేశావు.

మొత్తానికి గట్టి పిండానివే,ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే రాణించావు.తెలివిగల బిడ్డవి, అన్ని మంచి మంచి ప్రాజెక్టు లే ఎంచుకుని హిట్ లు కొట్టావు.తెలుస్తూనే  ఉంది.ఇంటర్వ్యూ ల్లోను,టీవీ షోల్లోనూ చూపిస్తున్నావుగా. అంతేలే ఆ మాత్రం ఉండాలి అదేగా సినిమాకి కావలసింది.అందిపుచ్చుకుంటున్నావుగా ఆ పంచ్ లు,ఆ సెటైర్లు ఇప్పుడు సినిమా పరిశ్రమలో నడుస్తుంది క్యాచ్ చేశావుగా.. ఇంకేంటి పెళ్లేనా.? అది అయిపోతే అబ్బో హైదరాబాద్ కి బాద్ షా ఓ ఓ ఓ….రాజధానికి రాజా….తరుణ్ రాజా మజాకానా

హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ ను కొనబోతున్నాడట రాజ్ తరుణ్ .ఇటీవలే ఏకే .ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థతో మూడు సినిమాలలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.అందుకుగాను ఈ అపార్ట్ మెంట్ ఇవ్వబోతున్నట్టు ఫిలింనగర్ లో గుసగుసలు.

Leave a Reply