అందగాడిని అంధుడిని చేశారే..!

Posted November 17, 2016

Raj Tarun Doing Bilnd Characterఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ తో ఏ రేంజ్ కు వెళ్లాడో తెలిసిందే. కుర్ర హీరోల్లో సరికొత్త జోష్ ప్రదర్శించిన రాజ్ ఇప్పుడు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అంధగాడు’ సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలో రాజ్ తరుణ్ అంధుడిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. రాజ్ లాంటి అందగాడిని అంధుడిగా ఎలా చూపిస్తారో చూడాలి.

రచయితగా ఉన్న వెలిగొండ శ్రీనివాస్ ఇప్పుడు డైరక్టర్ గా మారుతున్నాడు. హెబ్భా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజ్, హెబ్భా పటేల ల కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో తెలిసిందే.. మరోసారి ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు.

SHARE