Posted [relativedate]
‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాజ్ తరుణ్ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకునేలా ఈయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అందుకే ఈయనకు జూనియర్ మాస్ మహారాజా అనే ట్యాగ్‌ను ఆయన అభిమానులు తలిగిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా మెల్ల మెల్లగా సెటిల్ అవుతూ వస్తున్న సమయంలో ఆయన్ను తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు చిత్రాలు రాజ్ తరుణ్ చేతికి వచ్చినట్లే వచ్చి చేజారి పోయాయి.
‘శతమానం భవతి’ మరియు ‘నేను లోకల్’ చిత్రాలు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు విజయాలను మిస్ అయిన రాజ్ తరుణ్ తాజాగా మరో అవకాశాన్ని కూడా మిస్ అయ్యాడు. దిల్‌రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరో కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమాలో మొదట రాజ్ తరుణ్‌ను అనుకున్నారు. కాని తాజాగా రాజ్ తరుణ్ స్థానంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ వచ్చి చేరాడు. త్వరలోనే ఆ సినిమా ప్రారంభంకు సిద్దం అవుతుంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే రాజ్ తరుణ్‌ను కావాలని తొక్కేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన సన్నిహితులు కూడా ఇదే అనుమానంను వ్యక్తం చేస్తున్నారు. రాజ్ తరుణ్ కాస్త జాగ్రత్తగా ఉండకుంటే కెరీర్ మరింతగా కష్టాల్లో పడే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.