పెళ్లి చేసిన మీడియా కి రాజ్ తరుణ్ థాంక్స్ ..

Posted September 25, 2016

raj-300x253
ఓ యాంకర్ తో తనకు పెళ్లి అయిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై యంగ్ హీరో రాజ్ తరుణ్ స్పందించాడు. సోషల్ మీడియాని ఓ ఆటాడుకుంటూ పెళ్లి చేసినందుకు థాంక్స్ అంటూ సెటైర్ వేసేశాడు. రాజ్ తరుణ్ ఇంతకీ ఏమన్నాడో తెలుసా ?

సభకు నమస్కారం ,
నా సంబంధం,ప్రమేయం లేకుండా.. కుమారి 21 ఎఫ్ ఆడియో రిలీజ్ లో ఒకే ఒక్క సారి కలిసిన లాస్యతో నా పెళ్లి జరిపించిన కొంతమంది మీడియా మిత్రులకి,వెబ్ సైట్ దారులకి నా కృతజ్ఞతలు ..
నా వెటకారానికి క్షమించండి.. కానీ ఇలాంటి చెత్త వార్తలపై, నిరాధార సమాచారం, పుకార్లపై ఇంతకన్నా ఎలా స్పందించాలో నాకు అర్ధం కాలేదు. ఇంకా మూడేళ్లపాటు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు.. అలాంటి నాకు లేచిపోవాల్సిన అవసరమేంటి? పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ అందరికీ చెప్పే చేసుకుంటా. ఈ పుకారుపై సమయం వెచ్చించిన వారందరకీ కృతజ్ఞతలు.. దాని గురించి ఇప్పుడు ఇది చదివి సమయం వృధా చేసుకున్న వారికి సారీ ..ఇట్లు రాజ్ కిరణ్

SHARE