ఆ పాటలో రాజమౌళి మెరుస్తాడా?

  rajamouli act nani majnu movie
దర్శకధీరుడు రాజమౌళి సొంత సినిమాల్లో ఎక్కడోచోట కనపడుతుంటారు.అయితే ఈసారి ఆయన వేరే దర్శకుడి సినిమాలో కనిపించబోతున్నారు.ఆ డైరెక్టర్ ఉయ్యాల జంపాల తీసిన విరించి వర్మ .ఆ సినిమా నాచురల్ స్టార్ నాని హీరో గా,ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మజ్ను.ఆ సినిమాపాటల్ని వెరైటీగా విడుదల చేస్తున్నారు.రెండో పాటని రెడ్ fm రేడియో స్టేషన్ లోరిలీజ్ చేశారు.

భలేభలే మగాడివోయ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.వచ్చే వారం లహరి ద్వారా పూర్తి ఆల్బం రిలీజ్ అవుతుంది.ఈ సినిమాకి అన్నిటికన్నా ప్రత్యేకం రాజమౌళి వెండితెర మీద కనిపించడమే.అయన ఓ పాటలో ఉంటాడని కొందరు ..కాదు కొన్ని సీన్ లలో ఉంటాడని మరికొందరు చెప్తున్నారు .ఈ ఊహాగానాలు సినిమాకి ప్లస్ అవుతాయనుకుంటూ నిర్మాతలు అసలు విషయం చెప్పకుండా నర్మగర్భంగా నవ్వుకుంటున్నారు.

SHARE