బాహుబలి-2 కి సెంటిమెంట్ సవాల్..??

0
483
rajamouli bahubali 2 movie sentiment

Posted [relativedate]

rajamouli bahubali 2 movie sentimentబాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వండర్స్ ని క్రియేట్ చేసింది. దాదాపు 500కోట్లు వసూలు చేసిన ఈ టాలీవుడ్ వండర్ కి  ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోందన్న విషయం తెలిసిందే. బాహుబలి.. ది బిగినింగ్ కి సీక్వెల్ గా బాహుబలి.. ది కన్ క్లూజన్ పేరుతో ఏప్రిల్ 28న విడుదలకు రెడీ అవుతోంది. అయితే బాహుబలి-1 విడుదల తర్వాత రికార్డులను బద్దలు కొడితే ఈ సీక్వెల్ మాత్రం రిలీజ్ కాకముందే ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఈ సీక్వెల్ విడుదలకు ముందే 500 కోట్ల బిజినెస్ చేసిందని  సమాచారం. అయితే ఇక్కడే పెద్ద చిక్కువచ్చిపడిందంటున్నారు సినీ విమర్శకులు. అందుకు కారణం ఆ సినిమా సీక్వెల్ కావడమే.

తెలుగులో ఇంతకు ముందు వచ్చిన సీక్వెల్స్ అన్నీ ఆశించినంత విజయాన్ని అందించలేదని వారి వాదన. నిజానికి ఈ సీక్వెల్ ట్రెండ్ హాలీవుడ్ ది.. అక్కడి నుండి బాలీవుడ్ కి పాకింది. బాలీవుడ్ లో సీక్వెల్ మూవీసైన  మున్నాభాయ్, ధూమ్, మస్తీ లు కలెక్షనల్లో దుమ్ము రేపాయి. మెల్లగా  ఈ ట్రెండ్ కోలీవుడ్, టాలీవుడ్ లకి కూడా పాకింది. అయితే కోలీవుడ్ కి కలిసొచ్చింది.. టాలీవుడ్ కి కలిసిరానిది సీక్వెల్ అని చెబుతున్నారు విశ్లేషకులు.

గతంలో సీక్వెల్స్ గా వచ్చిన చిరు… శంకర్ దాదా జిందాబాద్, పవన్ కళ్యాణ్… సర్దార్ గబ్బర్ సింగ్, చంద్రముఖి సీక్వెల్ అయిన నాగవల్లి  ఈ సీక్వెల్ సెంటిమెంట్ ని బలపరిచాయి. తన సినిమాలు వివాదంలో చిక్కుకుంటున్నా సరే ఆ సినిమాలను  ఎంతో క్రియేటివిటీతో తెరకెక్కంచే రామ్ గోపాల్ వర్మ  కూడా మనీ-2 తీసి విఫలమయ్యాడు. అయితే ఇవన్నీ ఆయా హీరోల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని పరిమితమైన బడ్జెట్ లో తీసినవి. కానీ బాహుబలి-2 విషయం వేరు. కొన్ని కోట్లు ఖర్చుపెట్టించి మరీ జక్కన్న ఈ సీక్వెల్ ని చెక్కుతున్నాడు. మరి జకన్న ఈ సెంటిమెంట్ సవాల్ ని ఎలా ఎదుర్కుంటాడో  చూడాలి. ఒకవేళ ఈ సినిమా..  సీక్వెల్ సెంటిమెంట్ ని జయించి ఘనవిజయం సాధిస్తే,  టాలీవుడ్ ని పట్టిపీడిస్తున్న నెగిటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడన్న ఇంకో క్రిడిట్ జక్కన్న ఖాతాలో చేరుతుంది. మరి సెంటిమెంట్ సవాలు ను జక్కన్న ఎలా ఫేస్ చేయబోతున్నాడో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే.

Leave a Reply