జక్కన్న చేతిలో మరో రెండు సినిమాలు…

0
149
rajamouli committed two more movies with arka media

Posted [relativedate]

rajamouli committed two more movies with arka mediaటాలీవుడ్ జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో  జక్కన్న  పేరు ఓ రేంజ్  లో మార్మోగిపోతోంది. దీంతో పాటుగా ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్  గా నిలవడంతో  జక్కన్న ఖాతాలో అపజయం లేని దర్శకుడు అన్న ఖ్యాతి కూడా చేరింది.

ప్రస్తుతం బాహుబలి- 2 ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమాని వచ్చే నెల 28న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జక్కన్న గురించి టాలీవుడ్ లో మరో ఇంట్రస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. బాహుబలి  సినిమాను ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆర్కా మీడియా సంస్థకే మరో రెండు సినిమాలు చేసేందుకు జక్కన్న కమిట్ అయ్యాడని ఆ వార్తల సారాంశం. అలాగే దుర్గా ఆర్ట్స్ అధినేత కే.ఎల్. నారాయణ నిర్మాతగా, మహేష్ బాబు హీరోగా ఓ సినిమాను చేయనున్నాడట రాజమౌళి. దీనితో పాటుగా ఎన్టీఆర్ హీరోగా మరో సినిమాను కూడా తెరకెక్కించనున్నాడట. మరి ఆర్కా మీడియాతో కమిట్ సినిమాలు… మహేష్, ఎన్టీఆర్  సినిమాల తర్వాత ఉంటాయా లేక  వెంటనే ట్రాక్ ఎక్కనున్నాయా తెలియాల్సిఉంది. అలానే ఆ బ్యానర్ లో  చేసే సినిమాలలో ఏ హీరో నటించనున్నాడో కూడా ప్రకటన వచ్చే వరకు సస్పెన్సే.

Leave a Reply