కన్ఫ్యూజన్ లో రాజమౌళి..

0
610
rajamouli confusion on bahubali 2 climax

Posted [relativedate]

rajamouli confusion on bahubali 2 climaxబాహుబలి-2  ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా సినిమాకు సంబంధించిన రహస్యాలను దాచిపెట్టాడు రాజమౌళి. అయితే ఇప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజన్ తో కంగారుపడుతున్నాడట. సినిమా క్లైమ్యాక్సే అందుకు కారణమని అంటోంది చిత్రయూనిట్.

ఈ సినిమాకోసం నాలుగు క్లైమాక్స్ లను చిత్రీకరించారట. కనీసం టీమ్ మెంబర్స్ కు కూడా స్టొరీలోని కీలకపాయింట్స్ లీక్ కాకుండా ఉండేందుకే రాజమౌళి  ఇలా చేశాడని సమాచారం. అయితే ఇప్పుడు ఉన్న 4 క్లైమాక్స్ లలో  ఏది సెట్ చేయాలనే విషయంలో రాజమౌళి తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని అంటున్నారు. కాగా కావాలనే రాజమౌళి ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కలర్ ఇస్తున్నాడని, ఇది కూడా సినిమాకు హైప్ తీసుకొచ్చే ఓ టెక్నిక్ అని ఫిలింనగర్ వర్గాల టాక్. అసలు క్లైమ్యాక్స్  బైటకు పొక్కకుండా ఉండడం కోసమే ఇలా చేస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా బాహుబలి-2 రిలీజ్ అయ్యేవరకు ఇలా ఏదో ఒక న్యూస్ రావడం  మాత్రం ఖాయమేనని చెబుతున్నారు.

Leave a Reply