రాజమౌళి రెక్కలు ఊడిపోతున్నాయా?.

Posted September 27, 2016

 rajamouli feel techinisions going another way

టాలీవుడ్ లో ప్లాప్ మాటెరుగని దర్శకుడు రాజమౌళి.తెలుగు చిత్ర సీమ ప్రమాణాల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి శ్రమిస్తున్న దర్శక ధీరుడు అయన. రాజమౌళి విజయాల్లో కీలక పాత్ర పోషించిన,పోషిస్తున్న వారిలో ముఖ్యులు …సంగీత దర్శకుడు కీరవాణి,కెమెరా మెన్ సెంథిల్ కుమార్ ,ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ..ఈ ముగ్గురి గురించి,వారి టాలెంట్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ట్రాక్ రికార్డు చూస్తే వాళ్లేమిటో అర్ధమవుతుంది.

ఇప్పుడు ఆ ముగ్గురు వేర్వేరు కారణాలతో తాత్కాలికంగా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే కీరవాణి రిటైర్మెంట్ డేట్ ప్రకటించారు.డిసెంబర్ 8,2016 నుంచి సినిమాలకి దూరంగా నచ్చిన జీవితం గడుపుతానని చెప్పారు.ప్రస్తుతం బాహుబలి 2,ఓం నమో వెంకటేశాయ చిత్రాలకి మాత్రమే పని చేస్తున్నారు.అయన చెప్పిన మాటకి నిలబడితే వీటి తరువాత మరో సినిమా ఒప్పుకునే అవకాశం లేదు.అంటే బాహుబలి 2 తర్వాత అన్న సంగీత శక్తీ తమ్ముడికి వుండదన్నమాట.

ఇక స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఇప్పటికే దర్శకత్వ బాధ్యత వైపు మొగ్గు చూపితే..కెమెరా మెన్ సెంథిల్ కుమార్ కూడా డైరెక్షన్ ఆలోచన చేస్తున్నారు. బాహుబలి తరువాత వీరు ఆ పనుల్లో మునిగిపోవచ్చు.అదే జరిగితే ఒక్కసారే రాజమౌళికి సీనియర్ సాంకేతిక నిపుణులు దూరమవుతారు.ఈ సవాల్ ని దర్శక ధీరుడు ఎలా అధిగమిస్తారో చూడాలి.

SHARE