రాజమౌళి ఎందుకు గ్రేట్ అంటే ..

Posted September 25, 2016

M_Id_401897_SS_Rajamouli-300x182
రాజమౌళి ఎందుకు గొప్ప దర్శకుడు అయ్యాడో ఎం.ఎస్.ధోని ఆడియో ఫంక్షన్ లో అయన మాటలతో అర్ధమైంది. వరల్డ్ కప్ గెలిచాక దాన్ని జట్టు సభ్యుల చేతికిచ్చి పక్కన నిలబడ్డ ధోని ని ప్రపంచమంతా చూసింది. కానీ కొన్ని నిమిషాలపాటు మాత్రమే కనిపించిన ఆ దృశ్యాన్ని మాత్రమే కాదు ..ధోని లోని కర్మ యోగి తత్వాన్ని చూడగలగడం… అందులోనూ కప్ గెలిచిన ఆనందపు క్షణాల్లో దాన్ని గుర్తించగలగడం రాజమౌళి కి మాత్రమే సాధ్యమేమో! ఒక్క దృశ్యంతో గెలిపించడం మాత్రమే తన పని అన్నట్టు ధోని గీతా తత్వాన్ని ఆచరించాడని రాజమౌళి చెప్పడం ఆయనలోని సునిశిత దృష్టికి తార్కాణం .ఓ చిన్న దృశ్యంలో ఇంత లోతైన జీవిత సత్యాల్ని చూడగలిగే రాజమౌళి దార్శనికతకి సలాం కొట్టాల్సిందే.

SHARE