నిజంగానే జక్కన్న ఆ విషయాన్ని దాచాడా..?

Posted February 1, 2017

rajamouli hide shahrukh khan role in bahubali 2 movieసినిమాల్లో ప్రతీ సీన్ ని ఆడియన్స్  కి  నచ్చే విధంగా చెక్కుతూ టాలీవుడ్ జక్కన్నగా పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. కేవలం సీన్స్ తీయడంలోనే కాదు.. సినిమాను మార్కెటింగ్ చేయడంలోనూ, భారీ వసూళ్లను రాబట్టే విధంగా సినిమాకు పబ్లిసిటీ ఇవ్వడంలోనూ, మార్కెటింగ్ చేయడంలోనూ దిట్టే మన జక్కన్న. అందుకే బాహుబలి అన్ని వందల కోట్లను రాబట్టగలిగింది. ఈ సినిమా అందించిన భారీ విజయం… పార్ట్-2పై మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ హైప్ ను అలానే కంటిన్యూ చేసేందుకు  పార్ట్ -2 లో ఇద్దరు స్టార్ హీరోల చేత నటింపచేశాడని సమాచారం.

 ‘బాహుబలి-2’లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించాడన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ప్రమోషన్లు మొదలైన తర్వాత సడెన్ సర్‌ ప్రైజ్ ఇచ్చి షారుక్ లుక్ రివీల్ చేయనున్నాడని,  షారుక్ ను సినిమాలో భాగం చేయడం ద్వారా బాలీవుడ్ అభిమానులు  సినిమాకు క్యూ కట్టేలా రాజమౌళి ప్లాన్ వేశాడని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే రాజమౌళి చెప్పేవరకు వెయిట్ చెయ్యక తప్పదు.

SHARE