షారుఖ్‌తో నో.. అమీర్‌తో అయితే ఓకే అంటున్న జక్కన్న!!

0
240
rajamouli interested in ameerkhan for mahabharatham

Posted [relativedate]

rajamouli interested in ameerkhan for mahabharatham
రాజమౌళికి ‘బాహుబలి’ వంటి భారీ చిత్రం తెరకెక్కించినా కూడా ఇంకా అసంతృప్తి మిగిలే ఉంది. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన రోజు ఆ అసంతృప్తి అనేది పోతుందట. రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఠక్కున చెప్పే పేరు మహాభారతం. రాజమౌళి భవిష్యత్తులో ఎప్పుడైనా మహాభారతంను సినిమాగా తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఆ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ప్రస్తుత అనుభవం సరిపోదు అంటూ జక్కన్న చెబుతూ వస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌ బాద్‌ షా కూడా మహాభారతం ప్రాజెక్ట్‌పై ఆసక్తిని వ్యక్తం చేశాడు.

షారుఖ్‌ ఖాన్‌ వ్యాఖ్యల తర్వాత వీరిద్దరు కలిసి ఆ ప్రాజెక్ట్‌ను చేస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు. వీరిద్దరు కలిస్తే సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో ఆ సినిమాకు భారీ క్రేజ్‌ వస్తుందని ఆశించారు. అయితే రాజమౌళి మాత్రం ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ను షారుఖ్‌ ఖాన్‌తో చేసే విషయమై ఆసక్తి చూపడం లేదు. అదే ప్రాజెక్ట్‌ను అమీర్‌ ఖాన్‌ ఆసక్తి చూపితే భవిష్యత్తులో తాను సిద్దం అంటూ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న చెప్పుకొచ్చాడు. అమీర్‌ ఖాన్‌తో రాజమౌళికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సన్నిహిత్యంతోనే అమీర్‌తో అయితే మహాభారతం చేస్తానని జక్కన్న చెబుతున్నాడు. 2020 తర్వాతే మహాభారతంను జక్కన్న మొదలెట్టే అవకాశాలున్నాయి. మరి అప్పటి వరకు ఏమైనా జరగవచ్చు.

Leave a Reply