‘బాహుబలి 2’లో కూడా సమాధానం లేని ప్రశ్నలు

0
624
rajamouli not reveals suspenses in bahubali 2 movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

rajamouli not reveals suspenses in bahubali 2 movie
‘బాహుబలి’ మొదటి పార్ట్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి పార్ట్‌లో ఒక పూర్తి స్థాయి కథ అంటూ లేదు. అలాగే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలతో ఆ సినిమా ముగిసింది. అయినా కూడా ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అన్ని ప్రశ్నలు సమాధానాలు తెలియకున్నా ఆ సినిమా విజయం అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇక ‘బాహుబలి 2’లో ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తుందని అంతా భావించారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయంతో పాటు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.

‘బాహుబలి 2’లో ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానం లభించలేదు. భల్లాలదేవుడి భార్య ఎవరు అనేది తెలియరాలేదు. ఇక అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రులు ఎవరు, వారు ఎలా చనిపోయారు అనే విషయం, మాహిష్మతి రాజ్యంకు శివగామి మహారాణిగా ఎందుకు అయ్యారు అనే విషయాలపై మొదటి పార్ట్‌లో క్లారిటీ ఇవ్వలేదు, అలాగే రెండవ పార్ట్‌లో కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక తమన్నా పాత్రకు సంబంధించిన పలు సీన్స్‌ను సెకండ్‌ పార్ట్‌లో చిత్రీకరించారు. కాని నిడివి ఎక్కువ అయిన కారణంగా డిలీట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. తమన్నా పాత్ర గురించి కూడా స్పష్టత లేదు.

Leave a Reply