Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజమౌళి… బాహుబలి మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు..ఇప్పుడు రాజమౌళి సంపాదించిన ఇమేజ్ ఇండియాలో మరే డైరెక్టర్ సంపాదించలేదు. రజినీకాంత్ హీరో గా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి… ఆ స్టైల్ ,నటన ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతుల గురించి, ఆయన ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే రికార్డ్స్ బద్దలు అవ్వటం ఖాయం అని అందరికి తెలిసిన విషయమే. ఈ కల ని నెరవేర్చడానికి మలయాళంలో ‘ప్రేమమ్’ లాంటి ఆల్ టైం క్లాసిక్ తీసిన అల్ఫాన్సో పుతెరిన్ ముందుకు వచ్చారు.
ఈ కాంబినేషన్ గురించి ఆయన మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే అది ‘అవతార్’ కన్నా పెద్దదవుతుంది,ఇప్పటి వరకు నెలకొన్న రికార్డ్స్ అన్ని తుడుచుకొనిపోవటం ఖాయం అని చెప్పారు. ఈ మాటలు కొంచెం విడ్డూరంగా అనిపించొచ్చు కానీ.. ఈ కాంబో లో మూవీ అయితే అది మామూలుగా ఉండదన్నది మాత్రం వాస్తవం.రాజమౌళి కూడా రజినీతో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నట్లు.. రజినీ కూడా ఆసక్తితోనే ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో లండన్ లో బాహుబలి టీంతో కలిసి ఓ సినీ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి.. అక్కడ బీబీసీ వాళ్లతో చిట్ చాట్ సందర్భంగా రజినీతో సినిమా గురించి స్పందించాడు. రజినీకాంత్ చాలా పెద్ద స్టార్. ఆయన అణకువకు మారుపేరు. రజినీ సార్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా కల నెరవేరినట్లే. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే నేను ఎవరితో ఏ సినిమా చేయాలన్నా కథే నన్ను నడిపించాలి. కథను బట్టే నటీనటుల్ని ఎంచుకుంటా. ఆయనకు సరిపడే కథ నా దగ్గరుంటే.. ఆయనతో సినిమా చేసేలా కథ నన్ను ఇన్ స్పైర్ చేస్తే కచ్చితంగా చేస్తా. అదే జరిగితే ఈ లోకంలో నాకంటే సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరు అని రాజమౌళి అన్నాడు.