బాహుబలి-3 కూడానా..?

Posted March 20, 2017

rajamouli plan to bahubali 3 movieబాహుబలి-1, బాహుబలి-2లే కాకుండా బాహుబలి-3 కూడా ఉందా అంటే ఉందనే అంటున్నారు జక్కన్న సన్నిహితులు. విజువల్ వండర్ గా తెరకెక్కిన బాహుబలి-1 విడుదల తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక బాహుబలి-2 విషయానికొస్తే కేవలం  ట్రైలరే ఎంత హంగామా చేస్తోందో చూస్తూనే ఉన్నాం. మైండ్‌ బ్లోయింగ్‌ వీఎఫ్‌ఎక్స్‌ తో తెరకెక్కిన ఆ ట్రైలర్‌ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను మరింత పెంచేలా ఉంది.

బాహుబలి-1లో మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడుకున్న అన్నదమ్ములు బాహుబలి-2లో ఓ రాజకుమారి కోసం యుద్దానికి తలపడనున్నారు. అయితే  ఆ యుద్దంలో  భళ్లాలదేవ ఓడిపోతాడట. యుద్ధంలో ఓడిపోయిన భళ్లాలదేవ బాహుబలి-3లో బాహుబలి మీద పగ తీర్చుకోనున్నాడని సమాచారం. నిజానికి బాహుబలి-2 గతేడాది జులైలో  విడుదల కావాల్సిన ఉన్నా మన జక్కన్న పుణ్యమా అని వచ్చే నెల ఏప్రిల్ లో విడుదల అవుతోంది. మరి ఇప్పుడు బాహుబలి-3 అంటే మరో మూడు సంవత్సరాలు ఆగాల్సిందేనేమోనని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

SHARE