ఇదే బాహుబలి గుట్టు ….రాజమౌళి రహస్యం బద్దలు

Posted October 1, 2016

rajamouli press meetకట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?ఈ ప్రశ్నకి అసలైన సమాధానం ఇంతవరకు బయటకు రాలేదు.ఏడాదికి పైగా ఆ సస్పెన్స్ వీడకుండా రాజమౌళి బాగానే జాగ్రత్త పడ్డారు.ఆ గుట్టు రట్టు కాకుండా చూడ్డంలో సక్సెస్ అయ్యారు.అయితే నిన్నటి ప్రెస్ మీట్ లో రాజమౌళి మరో సస్పెన్స్ కి తెర లేపారు.ఈ నెల ఐదున ప్రభాస్ ఫాన్స్ కి శుభ వార్తని చెప్పారు .అది పెళ్లి కాదని అయన అభిమానుల తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించే ఓ విషయమని చెప్పారు.అదేంటో మీకే తెలుస్తుందిలే అని రాజమౌళి విషయాన్ని గుప్పిట మూశారు.అయితే ఆ సస్పెన్స్ అప్పటిదాకా కొనసాగకుండా చూసింది మీడియా.రాజమౌళిని ఫెయిల్ చేస్తూ ఆ విషయాన్ని రాబట్టింది.
రాజమౌళి దాచిన ఆ సీక్రెట్ ఏంటంటే…బాహుబలి ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేయబోతున్నారు.అందుకే దీన్ని చిత్రపరిశ్రమ గౌరవించే అంశంగా రాజమౌళి అభివర్ణించాడు.ఏమైనా ఈసారి రాజమౌళి రహస్యాన్ని మీడియా బయటికి రాబట్టింది.

SHARE