రాజమౌళి స్ట్రాంగ్ రిక్వెస్ట్ కు వర్మ షాక్..!

Posted December 20, 2016

Rajamouli Request RGV At Shiva To Vangaveeti Program

కొద్ది గంటల క్రితం జరిగిన రాం గోపాల్ వర్మ సిని ప్రస్థానం శివ టూ వంగవీటి కార్యక్రమంలో వర్మని అన్ని విధాలుగా టార్గెట్ చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. మద్రాస్ లో డైరక్టర్స్ ను కలిసినప్పుడు గుడ్ మార్నింగ్, నమస్తే లాంటివి చెప్పాలని.. అయితే అలాంటివి వర్మకు అసలు ఇష్టం లేవని తెలిసి అసలు వర్మను ఎలా విష్ చేయాలని తాను చాలా సార్లు ప్రాక్టీస్ చేశానని అన్నాడు రాజమౌళి. శివతో ఎంతోమంది వందలమంది డైరక్టర్స్ కు స్పూర్తి ఇచ్చిన వర్మ గారు మా జెనెరేషన్ కు వస్తున్న జెనరేషన్ కు కూడా ఆయన మంచి ఇన్సిపిరేషన్. చాలా గొప్ప సినిమాలు తీసిన వర్మ మధ్యలో ఐస్ క్రీం, అడవి లాంటి సినిమాలు తీస్తుంటారు ఎందుకో అర్ధం కాదు.

మూడు నాలుగు సంవత్సరాల నుండే వర్మతో టచ్ లోకి వచ్చిన తాను ఆ విషయం గురించి అడిగితే నా హిట్లు అన్ని యాక్సిడెంటల్ గా వచ్చినవి.. ఇక చేసే ఫ్లాపులన్ని ఇంటెన్షనల్ గా చేసేవి అన్నారు. ఆయన ట్వీట్స్ లానే దాని అర్ధం ఏంటి అని బుర్రలు బద్ధలు కొట్టుకున్నా అర్ధమవ్వవని అన్నారు రాజమౌళి. . ఎవరైనా సినిమా తీస్తే అందరు చూడాలని కోరుకుంటారు ఇక అలానే వర్మ చాలా రోజుల తర్వాత వంగవీటి సినిమా ప్రమోట్ చేయడం మంచి విషయమని అన్నారు. శివ, సత్య, రంగీల, కంపెనీ లాంటి ఆర్జివి మళ్లీ వచ్చాడని అనిపిస్తుంది. వంగవీటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ఆ సినిమా యూనిట్ అందరికి తన విశెష్ తెలిపారు రాజమౌళి. వంగవీటి రియల్ స్టోరీ మీద తనకు అంత అవగాహన లేకున్నా పోస్టర్స్ చూస్తుంటే అప్పట్లో పేపర్లో, టివిల్లో చూసినట్టుగానే అనిపిస్తుందని అన్నారు రాజమౌళి.

SHARE