జక్కన్న మహాభారతంలో నటులెవరంటే?

0
281
rajamouli said about mahabharata movie cast and crew

Posted [relativedate]

rajamouli said about mahabharata movie cast and crewఅప్పట్లో శివ సినిమా ఓ సెన్సేషన్. తెలుగు సినీ పరిశ్రమ చరత్ర గురించి చెప్పాలంటే బిఫోర్ శివ… ఆఫ్టర్ శివ సినిమా అని చెబుతారు. ప్రస్తుతం అయితే బిఫోర్ బాహుబలి… ఆఫ్టర్ బాహుబలి అని చెప్పుకుంటున్నారు. అంతలా టాలీవుడ్ ని మాయచేసింది బాహబలి. ఈ  క్రెడిటంతా దర్శక ధీరుడు రాజమౌళికే చెందుతుంది. ప్రస్తుతం బాహుబలి-2 పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న జక్కన్న తన నెక్ట్స్ సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడట.

గతంలో అమీర్‌ఖాన్‌ తనకు మహభారతంలో కృష్ణుడి పాత్రను పోషించాలని ఉందని, అలాగే షారుఖ్‌ ఖాన్‌ కర్ణుడి పాత్రను పోషించాలని వుందని స్పష్టంచేశారు. దీంతో రాజమౌళి తన సినిమాలో అమీర్ ని, షారుఖ్ ని నటింపచేసేందుకు ట్రై చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.  మరి ఎన్టీఆర్ సంగతేంటో జక్కన్నకే తెలియాలని అంటున్నారు. కాగా రాజమౌళి మాత్రం బహుబలి-2 తరువాత వెయ్యికోట్ల బడ్జెట్‌ తో గరుడ అనే సినిమా నిర్మిస్తానని, ఆ సినిమా నిర్మాణానికి మూడు సంవత్సరాల పట్టవచ్చని వెల్లడించాడు . మరి జక్కన్న మహాభారతం ముందు వస్తుందో లేక గరుడ వస్తుందో వేచి చూడాలి.  

Leave a Reply