Posted [relativedate]
తెలుగు చిత్రపరిశ్రమలో బాహుబలి చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో రాజమౌళి కీర్తి ఆకాశాన్ని తాకింది. వచ్చే నెలలో బాహుబలి-2 రానుంది. ఈ సినిమా గురించి ఇంటిపక్కన ఉండే బామ్మ నుంచి ఇంగ్లండ్ రాణి క్వీన్ ఎలిజిబెత్ వరకు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ప్రముఖ సినీ విశ్లేషకురాలు రాజమౌళిని ప్రశ్నించిందట. బాహుబలి–1 కేవలం స్టార్టప్ లాంటిదేనని, అసలు విందు మొత్తం బాహుబలి–2లోనే ఉంటుందని చెబుతూ అంచనాలు మరింతగా పెంచేశాడు.
మొదటి భాగంలో తాము కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని, అసలు కథలోకి ఇంకా వెళ్లలేదని చెప్పాడట. రెండో భాగంలోనే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రుచులనూ వడ్డించామని తెలిపాడట. అంటే బాహుబలి- 1 వైట్ రైస్ అయితే బాహుబలి- 2 దమ్ బిర్యానీ అన్నమాట. ఈ విషయం తెలియగానే అటు రాజమౌళి అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సినిమా కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేసినా మంచి ఎంటర్ టైన్ మెంట్ లభించనుదని ఆనందపడిపోతున్నారు.