బాహుబలి-2లో “చిరు” పుకార్లు: రాజమౌళి

0
551
rajamouli says chiranjeevi not giving voice over in bahubali 2 movie

Posted [relativedate]

rajamouli says chiranjeevi not giving voice over in bahubali 2 movieప్రస్తుతం తెలుగు  అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి-2. ఈ సినిమా విషయంలో ఎంతో గోప్యతను ప్రదర్శిస్తున్నాడు రాజమౌళి. అయితే సినిమా గురించి ఏ మాత్రం రూమర్ న్యూస్ లు వచ్చినా వెంటనే వాటిని ఖండిస్తున్నాడు. కాగా  ఇంతకుముందు ఈ సినిమా గురించి ఎన్నో రూమర్లు వచ్చినా రీసెంట్ వస్తున్న రూమర్ మాత్రం ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. బాహుబలి 2’ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలకు జక్కన్న ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు.

 మెగాస్టార్ చిరంజీవి వాయస్ ఓవర్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్నిరాజమౌళి  ఖండించాడు. తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబచ్చన్‌, తమిళంలో రజినీకాంత్‌, మలయాళంలో మోహన్‌ లాల్‌లు వాయిస్‌ ఓవర్‌ చెప్పబోతున్నారనే వార్తలు వచ్చాయని, అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు.  జక్కన్న చేసిన ఈ ఒక్క ట్వీట్ తో ఆ రూమర్ కి పుల్ స్టాప్ పడిపోయింది. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా  వచ్చే నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెయ్యి కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగబోతున్న ఈ సినిమా గురించి రిలీజ్ లోపు ఇంకెన్ని పుకార్లు వస్తాయో చూడాలి.

Leave a Reply