రజినీ తో రాజమౌళి సినిమా.?

Posted April 10, 2017

rajamouli to direct rajinikanth movieరజినీకాంత్.. ప్రపంచ వ్యాప్తంగా తన స్టైల్ తో అభిమానులను సంపాదించుకున్న ఏకైక సౌత్ ఇండియా సూపర్ స్టార్. రాజమౌళి.. బాహుబలి సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడుగా ఎదిగాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది..? ఈ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే అన్ని రికార్డు లు బద్దలు అవ్వటం ఖాయం.

నిన్న చెన్నై లో జరిగిన ‘బాహుబలి ది కంక్లూజన్’ తమిళ ఆడియో వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ .. నాకు రజినీకాంత్ అంటే చాలా ఇష్టం,ఆయనతో సినిమా తీయాలని నాకు ఎప్పట్నుంచో ఒక కోరిక ఉంది. కచ్చితంగా ఏదో ఒక రోజు తాను రజినీకాంత్ తో సినిమా చేస్తానని నా కల నేరవేర్చుకుంటానని అని చెప్పాడు రాజమౌళి. ఇంకా దీనితో పాటు మహాభారతం కూడా తీయాలని ఉంది అని అన్నాడు. మరి రజినీ తో మూవీ ఎప్పుడు చేస్తారు అని విలేకరుల అడిగితే ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతా. ప్రస్తుతం నా మదిలో ‘బాహుబలి’ తప్ప వేరే ఆలోచన ఏదీ లేదు’’ అని రాజమౌళి అన్నాడు.

ఇక ‘బాహుబలి ది కంక్లూజన్’ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి కథ అంతా ఒకటే. కానీ నిడివి ఎక్కువగా ఉండటంతోనే రెండు భాగాలుగా తీశాం. మొదటి భాగంలో పాత్రలను పరిచయం చేశాము, అలాగే మొదటి భాగం చూసిన ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు తలెత్తాయి, ఆ సందేహాలకు ‘బాహుబలి-2’లో సమాధానం దొరుకుతుంది. బాహుబలి చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది. బాహుబలిని తమిళంలో ప్రత్యేకంగా తీయాలనుకున్నప్పుడు తమిళ ఫ్లేవర్ పోకుండా నాజర్.. సత్యరాజ్ లాంటి వాళ్లతో ప్రతి విషయాన్ని చర్చించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం.తమిళ ప్రేక్షకులకు మాతృభాషలోని మాధుర్యం అందేలా ప్రతి దృశ్యం తీర్చిదిద్దాం అని రాజమౌళి అన్నాడు.

SHARE