శాతకర్ణిని పొగిడిన బాహుబలి బ్రహ్మ..!

0
450
Rajamouli Tweet About Krish Balakrishna Sathakarni Trailer

Posted [relativedate]

Rajamouli Tweet About Krish Balakrishna Sathakarni Trailerనందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మించి ఉంది అంటే అతిశయోక్తి కాదేమో. క్రిష్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమా ఓ కళాకండంగ తీర్చిదిద్దాడు. ఇక ఈ ట్రైలర్ చూసి బాహుబలి బ్రహ్మ అదేనండి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌలి కూడా ఫిదా అయ్యాడు.

కేవలం 8 నెనల్లో ఇంత గొప్ప సినిమా తీసినందుకు నీకు హ్యాట్సాఫ్ అంటూ క్రిష్ గురించి జక్కన్న ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాతో రాజమౌళి బాహుబలి-2 మీద మరింత భాధ్యత పెరిగిందని చెప్పొచ్చు. బాహుబలి రేంజ్లో ఈ సినిమా విజువల్స్ తో అబ్బురపరచిన క్రిష్ కచ్చితంగా సినిమా సరికొత్త సంచలనం సృష్టిచేలా చేశాడు. శాతకర్ణిగా బాలయ్య గర్జించడం చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర షురూ అన్నట్టే ఉంది. సంక్రాంతి రేసులో యుద్ధానికి దిగుతున్న బాలయ్య ఎలాంటి విజయాన్ని పొందుతాడో చూడాలి.

Leave a Reply