శాతకర్ణి కోసం రాజమౌళి ఎదురుచూపు ?

0
666

  rajamouli waiting balakrishna gowthami putra shatha karni movie
సంక్రాంతి హీరో గా మంచి సక్సెస్ లు కొట్టిన బాలయ్య మరో సారి అదే సెంటిమెంట్ నమ్ముకుంటున్నాడు.కెరీర్ మైలు రాయి అయిన 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతికే విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు,హీరో ఫిక్స్ అయిపోయారంతే.అందుకు తగ్గట్టే సినిమా షెడ్యూల్స్,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగేలా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసుకున్నారు.ఏ ఇబ్బంది లేకుండా ఆ ప్రణాళిక ప్రకారమే పని జరుగుతోంది.

వచ్చే నెల్లో దసరా కి సినిమా ఫస్ట్ లుక్,టీజర్ విడుదల చేయాలని శాతకర్ణి యూనిట్ భావిస్తోంది.ఫస్ట్ లుక్ ,టీజర్ ద్వారా సినిమా స్థాయి ఏమిటో చెప్పాలని క్రిష్ తహతహలాడుతున్నాడు. రాజమౌళి లాంటి దిగ్దర్శకులు సైతం ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారట.క్రిష్ టేకింగ్ సత్తా ఏమిటో కంచె తో ప్రూవ్ కావడంతో శాతకర్ణి ఇండస్ట్రీ లో అంతగా ఆసక్తి రేపుతోంది.

Leave a Reply