జక్కన్న గ్యారేజ్ వదలడా?

  rajamouli watched janata garage movie hyderabad
జక్కన్న…దర్శక ధీరుడు రాజమౌళికి ఎన్టీఆర్ పెట్టిన ముద్దు పేరు .సినిమాల్ని శిల్పాల్లా I’mచెక్కుతాడని కెరీర్ మొదట్లోనే తారక్ గుర్తించాడు.అప్పుడు జక్కన్న కి తారక్ ఆ పేరు పెట్టిన క్షణం ఏమిటో గానీ అదలా స్థిరపడిపోయింది.అంతకన్నా ఆ ఇద్దరి స్నేహం బలపడిపోయింది.తారక్ తన అభిమాన నటుడని చెప్పే జక్కన్న తనెంత బిజీ గా వున్నా అయన సినిమా రిలీజ్ అంటే ఫస్ట్ షో కి అక్కడ వాలిపోతారు.జనతా గ్యారేజ్ కి అలాగే వచ్చిన జక్కన్న ఏమి చేశాడో తెలుసా?

హైదరాబాద్ భ్రమరాంబ,మల్లిఖార్జున థియేటర్ల దగ్గరికి జనతా గ్యారేజ్ కోసం జక్కన్న వచ్చాడు.సినిమా బెనిఫిట్ షో చూసేశాడు.సరే అయన వెళ్ళిపోతారు అనుకుంటే వెంటనే స్టార్ట్ అయిన షో కూడా చూశాడు.అంత బిజీ దర్శకుడిని వరసగా రెండు సార్లు సినిమా చూసేంతగా జనతా గ్యారేజ్ కట్టిపడేసింది.అంతకన్నా ఆయన్ని ఎన్టీఆర్,రాజీవ్ కనకాల నటన ఆశ్చర్యంలో ముంచెత్తిందట.ఆ ఇద్దరి నటనకి జక్కన్న సెల్యూట్ చేసాడు.టెంపర్ నుంచి ఎన్టీఆర్ సినిమా సెలక్షన్ ని ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.

SHARE