Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తర్వాత సినిమా అల్లు అర్జున్ హీరోగా ఉండబోతుంది అంటూ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబో మూవీని డివివి దానయ్య నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడని, అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో సగం అబద్దం అని తేలిపోయింది. దానయ్య నిర్మాణంలో రాజమౌళి తర్వాత సినిమా ఉండటం నిజమే కాని ఆ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా ఉండటం అనేది అనుమానంగా తోస్తుంది.
‘మగధీర’ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మాణంలో రాజమౌళి తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సమయంలో రాజమౌళికి అల్లు అరవింద్‌కు మద్య విభేదాలు తలెత్తాయి అంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్ని పుకార్లే అయ్యి ఉంటాయని అప్పుడు అనుకున్నారు. కాని తాజాగా రాజమౌళి ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మగధీర సమయంలో అల్లు అరవింద్‌తో విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అని, అందుకే ‘మగధీర’ చిత్రం 100 రోజుల వేడుకకు తాను హాజరు కాలేదు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్‌తో విభేదాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా చేస్తాడని భావించడం అది వంద శాతం తప్పే అవుతుంది. అంటే అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా అని వస్తున్న వైరల్ న్యూస్ ఫేక్ అని తేలిపోయింది. అతి త్వరలోనే జక్కన్న తర్వాత సినిమా ఎవరితో అనే విషయమై క్లారిటీ వస్తుందని నిర్మాత దానయ్య అంటున్నాడు.