తీరని ‘రాజమౌళి’ కోరిక …

0
814

  rajamouli wishతెలుగు సినిమాను ఈ తరంలో జాతీయ,అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళీదే…ప్లాప్ అనే మాట తెలియని స్టార్ డైరెక్టర్ సృష్టించిన సునామీలు అన్నీ ఇన్నీకావు….హీరోలు ,నిర్మాతలు ఆయన కంటి చూపు తమమీద పడాలని పూజలు చేస్తుంటారు.అలాంటి రాజమౌళి కి ఓ కోరిక తీరకుండా అలా ఉండిపోయింది .తన శిష్యులు ఎవరైనా భారీహిట్ కొట్టాలన్నది ఆయన చిరకాలవాంఛ…రాజమోళి వాళ్ళ నెంత ఉత్సాహపర్చినా,వాళ్ళు మాత్రం ఆయన్ను నిరుత్సాహపరుస్తూనే ఉన్నారు.

బాలయ్య తో ‘మిత్రుడు’ తీసిన మహదేవ్,నితిన్ తో ‘ద్రోణ’చేసిన కరుణకుమార్,’సారాయివీర్రాజు’ డైరెక్ట్ చేసిన కన్నన్..ఇలా అంతా డిజప్పాయింట్ చేశారు.దిక్కులు చూడకు రామయ్య తీసిన ‘త్రికోటి ‘ఫర్లేదనిపించినా….మళ్ళీ మరో సినిమా ఊసు బయటకు రావడం లేదు..ఈ పరిస్థితుల్లో ఆయన శిష్యుడు కాకపోయినా,అన్న అయినా ఎస్.ఎస్.కాంచి మెగా ఫోన్ పట్టాడు….నిజంగా శిష్యరికం చేసినా,చేయకపోయినా..తమ్ముడు దగ్గర మంచి కిటుకులు నేర్చుకొని ఉండడా ఏంటి?ఆయన అయినా భారీ హిట్ కొట్టి రాజమౌళి కి కాస్త ఉపశమనం కలిగిస్తాడని ఆశిద్దాం!

Leave a Reply