రజనీ@బాబా

0
492

rajani2
కొన్నాళ్ళుగా కెమెరాకు చిక్కని సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. విశ్రాంతి కోసం అమెరికా వెళ్ళిన రజినీ కొన్నాళ్ళుగా అక్కడే ఉంటున్నారు. ఇటీవల తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌తో వర్జీనియా నగరంలోని సచ్చిదానంద్ లోటస్ టెంపుల్‌కి వెళ్ళారు తలైవా. అక్కడ పూజలు చేసిన రజినీకాంత్ ఆశ్రమంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారు. వీటికి సంబంధించిన ఫోటోలను ఐశ్వర్య తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. జూలై 20న రజినీకాంత్ అమెరికా నుండి ఇండియాకు వస్తున్నారని వార్తలు వస్తోండగా, ఫ్యాన్స్ చాలా ఆనందంలో ఉన్నారు. కబాలి రిలీజ్ టైంకి తమ అభిమాన హీరో చెన్నైకి చేరుకుంటున్నందున వారి ఆనందానికి అవధులు లేవు. సూపర్ స్టార్ నటించిన కబాలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తొలి షో మాత్రం జూలై 21న అమెరికాలో ఉదయం 11గం.లకు వేయనున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply