రజనీ కోసం అధికారిక సెలవు….

0
529

rajani kabali holiday

సాధారణంగా పండగలకు, ప్రత్యేక దినాలకు సెలవులు ప్రకటిస్తారు. కొన్నిసార్లు గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా.. ప్రైవేట్ కంపెనీలు మాత్రం పనిచేయిస్తుంటాయి. కానీ సినిమా రిలీజ్ నాడు ప్రైవేట్ సంస్థలు సెలవులిస్తే ఎలా ఉంటుంది? అవును మీరు చదివింది నిజమే..! కబాలి సినిమా రిలీజ్ రోజున చెన్నై, బెంగళూరుల్లో పలు ఆఫీస్ లు సెలవులు ప్రకటించాయి. ఈనెల 22న కబాలి హాలీ డే అని ప్రకటించాయి.

ట్రైలర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన కబాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్, మార్కెటింగ్, టికెట్ సేల్స్ లో సంచలనాలు సృష్టిస్తూ వస్తోంది. సూపర్ స్టార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే కబాలి మేనియాను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు సెలవులు ప్రకటించాయి.

ఎందుకంటే రజనీ సినిమాలంటే కాలేజీ అయినా, ఉద్యోగమైనా మూకుమ్మడి సెలవులు ఖాయం. ఒక వేళ సెలవు ఇవ్వకపోయినా హెల్త్ బాగోలేదనో.., లేక ఇంకేదో కారణంగానో ఆఫీస్ కు డుమ్మా కొడతారు. ఇంత తలనొప్పులు ఎందుకనుకున్న కంపెనీలు హాలిడే తో పాటు టికెట్లు కూడా ఇచ్చేస్తున్నాయి.

బెంగళూరులో ఉన్న వాటర్‌ ప్రూఫ్‌ కంపెనీ ఓపస్‌, చెన్నైలోని ఫైండస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు కబాలి మేనియాను ముందుగానే గుర్తించాయి. అందుకే 22న కబాలి హాలిడే ఇస్తున్నట్లు నోటీస్ పెట్టాయి. టికెట్స్ కూడా ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాయి. రజనీ సినిమా అంటే కోట్ల రూపాయల కలెక్షన్లే కాదు. అఫీషియల్ హాలిడేస్ కూడా కామనే. దటీస్ తలైవా..!

Leave a Reply