కబాలి ‘రివ్యూ’..

0
691

rajani kanth kabali review

చిత్రం : కబాలి (2016)
విడుదల తేదీ : 22 జూలై, 2016
నటీనటులు : రజనీ కాంత్, రాధికా ఆప్టే, ధన్సిక
దర్శకత్వం : పా రంజిత్
నిర్మాత : కళైపులి థాను
సంగీతం : సంతోష్ నారాయణ్

రజనీకాంత్.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు పడిచస్తారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్నక్రేజ్ అలాంటిది. రంజిత్ పా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబాలి’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి  భారతదేశ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ హైప్ ని క్రియేట్ చేసింది రజనీ ‘కబాలి’. కార్పోరేట్ కంపెనీలు కబాలి క్రేజ్ ని సొమ్ము చేసుకొన్నాయి. పబ్లిసిటీ పీక్స్ చేరిపోయింది. ప్రేక్షకుల అంచనాలు ఆకాశన్నంటాయి. ఇంతటీ భారీ అంచనాల మధ్య ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కబాలి’ మెప్పించిందా.. ? యువ దర్శకుడు రంజీత్ పా రజనీ ఫ్యాన్స్ ని మెప్పించే సినిమా తీశాడా.. ? ఇంతకీ ‘కబాలి’ కథేంటీ తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
మలేసియా.. అక్కడ ఓ మంచి గ్యాగ్ స్టర్ . పేరు కబాలీశ్వరన్‌ అలియాస్‌ కబాలి (రజనీకాంత్‌). భారతీయుల్ని మత్తుమందుకి బానిసలుగా మార్చి వాళ్లతో డ్రగ్స్‌ మాఫియాని నడిపించి సొమ్ము చేసుకొంటున్న మాఫియా గ్యాంగ్ లీడర్ టోనీలీ (వింగ్‌స్టన్‌ చావ్‌), అతనికి చెందిన 43 గ్యాంగ్‌లకు సీతారామరాజు(నాజర్) అనే ఉద్యమకారుడుతో కలసి ఎదురు తిరుగుతాడు కబాలి. సీతారామరాజుని పథకం ప్రకారం అంతమొందిస్తుంది టోనీ గ్యాంగ్‌. ఇక, అప్పటి నుంచి బాధితులకు పెద్దదిక్కుగా నిలబడుతాడు కబాలి. ఇంతలో కబాలిని అంతం చేసేందుకు టోనీ గ్యాంగ్‌ పక్కా స్కెచ్ వేస్తుంది. సీతారామరాజు కొడుకుతో పాటు మరికొంతమంది భారతీయుల్ని రెచ్చగొట్టి.. ఓ వేడుకలో పాల్గొన్న కబాలిపై హత్యాయత్నం చేయిస్తాడు. ఈ గ్యాంగ్ వార్ లో నిండు గర్భిణిగా ఉన్న కబాలి భార్య కుందన (రాధికాఆప్టే)ని కాల్చేస్తారు దుండగులు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. శాంతిభద్రతలకి విఘాతం కలిగిస్తున్నాడని కబాలిని అరెస్ట్‌ చేసి జైలుకి తీసుకెళతారు. కబాలికి.. 25 యేళ్ల జీవితం. శిక్షపూర్తి చేసుకొని విడుదలైన కబాలి  టోనీలీ గ్యాంగ్‌ తో పాటుగా 43 గ్యాంగ్ లను ఎలా అంతమొందిస్తాడు..?
కాల్పుల్లో ప్రాణాలతో బయటపడ్డ తన భార్య కుందనని, కూతురిని ఎలా కలుసుకొన్నాడనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
* రజనీ కాంత్
* రాధిక ఆప్టే
మైనస్ పాయింట్స్ :
* స్లో నేరేషన్
* మ్యూజిక్
* డైరెక్షన్
* యధార్థ సంఘటనలు

నటీనటుల ఫర్మామెన్స్ :
గ్యాంగ్ వార్ కథ.. మలేసియా నేపథ్యం.. హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ఇంకేం కావాలి.. ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టడానికి. రజనీ మేనరిజమ్స్‌, ఆయన లుక్‌,ఆయన స్టైల్‌.. ముఖ్యంగా రజనీ క్రేజ్ తో ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీయొచ్చు.దర్శకుడు రంజిత్ పా కూడా రజనీపైనే ఫుల్ ఫోకస్ చేశాడు. రజనీ ఇరగదీశాడు.మేనరిజ, లుక్స్, స్టయిల్ తో హౌరా అనిపించాడు. రజనీ నటనే సినిమాకి బలం.వన్‌ మేన్‌ షో చేశాడు. ఆయన స్టైల్‌లోనూ, హుషారులోనూ ఏమాత్రం జోరు తగ్గలేదు. కానీ, రజనీ స్వీడుకి కథ కనెక్ట్ కాలేదు. పెద్దగా ఆసక్తికరమైన అంశాలేమీ లేకుండా.. ఓ సాదా సీదా కథని రజనీ కోసం తయారు చేశాడు దర్శకుడు. ఇక్కడ రజనీ హిట్టయ్యాడు. దర్శకుడు ఫెలయ్యాడు. సూపర్ స్టార్ నమ్మకాన్ని డైరెక్టర్ నిలబెట్టలేకపోయాడు. రజనీ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర రాధిక ఆప్టేది. చాలా సహజంగా నటించింది. కబాలిని తిరిగి కలుసుకొనే సన్నివేశంలో రాధిక అద్భుతంగా నటించింది. టోనీలీ పాత్ర చేసిన విన్‌స్టన్‌ చావో ఫర్వాలేదనిపించాడు. మిగతా నటీనటులు ఫర్వాలేదనిపించారు. విదేశీ నటులున్నా.. కథలో బలం లేనందున ఏమీ చేయలేకపోయారు.

సాంకేతిక విభాగం :
సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే అద్భుతమైన అవకాశం వచ్చినా.. దర్శకుడు రంజిత్ పా సరిగ్గా వినియోగించుకోలేదు. సినిమా స్లో నేరేషన్ అనేది బిగ్గెస్ట్ మైనస్ గా నిలిచింది. నేపథ్య సంగీతం నిరాశజనకంగా ఉంది. సినిమాకి ఇంకా కత్తిరె పెట్టాల్సి ఉంది. ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ కాస్త షార్ప్ గా వ్యవహరించాల్సి ఉంది. ఫోటో గ్రఫీ బాగుంది. తెరపై కబాలి రిచ్ గా కనబట్టాడు.

ఫైనల్ గా : .
కబాలి రా.. ! అంటూ కొంతకాలంగా ఊపేసింది కబాలి. కబాలి ప్రమోషన్ పీక్స్ చేరింది. ఆ హంగామా, ఆ.. హడావుడిని దృష్టిలో పెట్టుకొని సినిమా చూసిన ప్రేక్షకుడు డిసపాయింట్ కావడం ఖాయం. కథనంలో వేగం లేకపోయినా రజనీ తన మేనరిజమ్స్‌తో కట్టిపడేశాడు. ఇది రజనీ ఫ్యాన్స్ కి కలిసొచ్చే అంశం. మొత్తానికి.. రజనీ ఫ్యాన్స్ వరకు  కబాలి.. ఓకే. ఇక, మిగితా వారికి క..’బలి’ !

బాటమ్ లైన్ : రజనీ క్రేజ్ ని బలి తీసుకొన్న క.. ‘బలి’..

రేటింగ్: 2.75

*గీత తల్లాప్రగడ 

Leave a Reply